trump tweet

ఇమ్మిగ్రేషన్‌కు ‘నో’ చెప్పిన ట్రంప్ – కరోనా సాకుతో వలసల్ని అడ్డుకునే ప్రయత్నం


సాధారణ పరిస్థితులు నెలకొలాలని అమెరికా ఎంతగానో పరితపిస్తోంది ఈలోగా అందరిని ఆశ్చర్యపరుస్తూ ట్రంప్ గత రాత్రి ఒక ట్వీట్ చేసాడు

కనిపించని శత్రువు చేస్తున్న దాడి నేపథ్యంలో అమెరికన్ల ఉద్యోగాలను కాపాడాల్సిన అవసరం ఉందని అందుకే అమెరికాలోకి వలసల్ని తాత్కాలికంగా నిలిపివేసే ఉత్తర్వులు జారిచేతున్నట్లు ట్వీట్టర్ లో పేర్కొన్నారు .
కరోనా వైరస్ ని ట్రంప్ కనిపించని శత్రువుగా అభివర్ణించారు.
గత నెలలో 2కోట్ల 20లక్షల మందికి పైగా నీరుద్యోగ అభివృద్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు
covid-19 తో జరిగే ఆర్థిక పతనం చాలా ఏళ్ళు ఉంటుందని భయాలు ఉన్నాయి యూరోప్ చైనాల నుంచి అమెరికాకు జరిగే ప్రయాణాలపై ఇప్పటికే నిషేధాలు ఉన్నాయి
కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన ఆoక్షణాలను అమెరికా క్రమంగా సడలించబోతున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు
ఫ్లోరిడాలోని కొన్ని బీచుల్లోకి ప్రజలను ఇప్పటికే అనుమతిస్తున్నారు ఈ వారాంతములో జార్జియా లో జిమ్స్ ,సెలూన్లు, కొన్ని క్రీడా ప్రాంతాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి .
వచ్చే వారం నుంచి రెస్టారెంట్స్ కూడా తెరుచుకుబోతున్నాయి ఆంక్షలతో అమెరికన్లు సహనం కోల్పోయినట్లు కనిపిస్తున్నారు
ఇళ్లకే పరిమితం కావల్లన ఆంక్షలను వ్యతిరేకిస్తూ అరిజోనా రాజధాని ఫీనిక్స్ లో జనం బయటికి వచ్చి నిరసన తెలిపారు
మరింత వేగంగా కరోనా టెస్టులు చేసే విషయం పై అక్కడి రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడుతున్నానని ట్రంప్ చెప్తున్నారు .
ఆంక్షలను సడలించే వ్యూహం లో ఇది కీలక భాగం ఈ విషయం లో న్యూయార్క్ గవర్నర్ ఇచ్చిన మద్దతును గుర్తించారు.