daddy arumugam

60 యేళ్ళ వయసులో లక్షలు సంపాదిస్తున్న యూట్యూబ్ స్టార్ | Daddy Arumugam village food factory channel


తన పేరు డాడీ ఆరుముగం అందరు అతన్ని ముద్దుగా డాడీ అని పిలుస్తారు .
చదివింది 6వ తరగతి వరకే కానీ ఇప్పుడు సంపాదిస్తుంది లక్షల్లో అది కూడా వంటచేస్తూ .

అవును మీరు విన్నది నిజమే Village Food Factory You tube channel కి 32లక్షల మంది Subscribers ఉన్నారు

6వ తరగతిలోనే చదువు మానేశారు. టీ, కాఫీ తోటల్లో పనిచేశారు. చిన్న హోటల్ పెట్టారు. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ ఒక్క ఐడియాతో ఈయన కొడుకు ఇచ్చిన ఐడియాతో తన దశ తిరిగింది.

యూట్యూబ్‌ ద్వారా వచ్చిన డబ్బులతో సొంత ఇల్లు కట్టుకున్నారు. ఈయన చేసే పనే ఈయనకు ఈ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. ఇంతకీ ఆరుముగం కథ ఏంటి ?

తమిళనాడులోని ఒక మారుమూల గ్రామం ఆరుముగంది తాను మొదటి నుండి చాల రకాల ఉద్యోగాలు చేసేవాడు తనకి నచ్చిన పని వంట వండడం తనలో ఉన్న మంచి వంటమనిషిని తాను అర్ధం చేసుకుని ఒక హోటల్ కూడా పెట్టాడు కానీ ఆ హోటల్ ఊహించినంత రీతిలో నడవలేదు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే తనది
కాబట్టి మల్లి ఎదావిదిగా చేతికి దొరికిన పనిని చేయడం మొదలు పెట్టాడు

అప్పుడు తన కొడుకు గోపినాద్ కి ఒక ఆలోచన వచ్చింది అదే యూట్యూబ్ లో ఛానల్ పెట్టి వంట చేయడం .
ఆరుముగం వెజ్ మరియు నాన్వెజ్ అన్నిట్లో దిట్ట కొడుకు ఆలోచన మీదకు తాను మొదట నెలలో 4-5 వీడియోలు చేసాడు దానికి గాను వాళ్ళకి వచ్చిన ప్రతిఫలం 7వేల రూపాయాలు దీనితో ఆరుముగం కి నచ్చలేదు వదిలేద్దాం ఏది సెట్అవ్వదు అనుకుంటున్నా సమయం లో రెండో నెల లో వాళ్ళ కి వై 40వేల రూపాయిలు వచ్చాయి ఇక ఆరుముగం కి కూడా మనసులో చేయాలి అనే ఆలోచన పడింది ఎలా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ 3వ నెలలోనే వాళ్ళ జీతం అక్షరాలా 1లక్ష రూపాయిలు వచ్చాయి ఇక అప్పటినుండి వెనక్కి తిరిగి చూడకుండా యూటుబ్లో వంటలు చేస్తున్నారు .

Video courtesy by BBC

దీన్ని పట్టి చుస్తే వాళ్ళకి ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నారు కాగా యూట్యూబ్ లో సంపాదించినా డబ్బుతోనే సొంత ఇల్లు కట్టుకున్నారు .
వాళ్ళు సంపాదించే డబ్బుతో వంటలు చేస్తూ రోడ్ల మీద ఆకలిగా ఉన్న పేదలకి పంచిపెడుతుంటారు