లాక్ డౌన్ కొనసాగించక తప్పదు..! |లాక్ డౌన్ పైCM KCR కీలక నిర్ణయం| CM KCR Speech on Coronavirus ||COVID-19- “06/04/2020”


తెలంగాణలో ఇప్పటికీ 364 మందికి క రో నా వైరస్ సోకింది మొదటి 50 మంది తో కలిపి దానిలో పదిమంది ఇండోనేషియా నుండి కరీంనగర్ కి వచ్చినవారు

తెలంగాణ 364 మంది ఫారిన్ రిటర్న్స్ 35 మంది ఇండోనేషియా పదిమంది ,ఇప్పటికే 11 మంది చనిపోయారు గాంధీ హాస్పిటల్ రికార్డు ప్రకారం.

308 మంది ఈరోజుకి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు వారికి ఎటువంటి ప్రమాదం లేదని తెలియజేశారు

నిజాముద్దీన్ మార్కస్ సభకు వెళ్లి వచ్చిన వారిలో ఈరోజుతో 1089 మందిని పోలీసులు మరియు ఇంటలిజెన్స్ వారి సహకారంతో కరోనా బాధితులను పట్టుకోవడం జరిగింది ఇంకా 35 మంది మార్కస్ లోనే ఆగిపోయారు వారిని ఢిల్లీలోనే బంధించడం జరిగింది

ఈ1089 మందిలో 170 మందికి కరోనా ప్రభావం ఉందని తేలింది ఈ చనిపోయిన 11 మంది కూడా నిజాముద్దీన్ మర్కస్ కి వెళ్లి వచ్చిన వారే ఈ 170 మందిలో దాదాపు 90 మందికి కరోనా పాజిటివ్ ఉందని తేలింది.

రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుంది వచ్చే రెండు మూడు రోజుల్లో కంప్లీట్ రిపోర్ట్ గాంధీ హాస్పిటల్ నుండి వస్తుంది.

జపాన్ సింగపూర్ ఫ్రాన్స్ డెన్మార్క్ జర్మనీ మలేషియా ఇటలీ కొలంబియా నార్వే నేపాల్ కొరియా ఆస్ట్రేలియా తదితర దేశాలలో వచ్చే నెల రోజుల వరకు పూర్తి లాక్ డౌన్లో ఉన్నారు దీన్ని బట్టి చూస్తే కరోనా తీవ్రత చాలా పెద్దగా ఉంది

BCG- Boston Consulting group all over world survey ప్రకారం మనదేశం జూన్ 3 వరకు పూర్తిగా లాక్ డౌన్ లో ఉండాలని తెలిపింది.

ఇన్ని రోజులు లాక్ డౌన్ లో ఉంటే ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుందని అయినా పర్లేదు అని ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఎకనామి నీ మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి సంపాదించుకోలేమని కెసిఆర్ గారు తెలియజేశారు

ఇంతకుముందు ఒక రోజులో 400 నుండి440 కోట్ల ఆదాయం తెలంగాణ లో ఉంది ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వల్ల రోజుకి 6 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది

వేరే దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి బాగుంది,లాక్ డౌన్ తీసివేసే ఆలోచన ఇప్పట్లో లేదు ఒకవేళ తీస్తే ఇప్పటివరకు పడిన శ్రమ అంతా వృధా అవుతుందని ఈ మహమ్మారిని అరికట్టే వరకు లాక్ డౌన్ పొడిగింపు జరుగుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలియజేశారు

ఇది ఒకరి సమస్య కాదు అందరి సమస్య దేశదేశాలన్ని ఈ కరోనా మహమ్మారి తో యుద్ధం చేస్తున్నారు ఈ వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది.

కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరికైనా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని అనుమానం ఉంటే వెంటనే 104 కి గాని లేదా దగ్గర్లో ఉన్న పోలీసులకు గాని తెలియజేయాలని కోరారు

ఇలాంటి సమయంలో ప్రజలందరూ సంఘీభావ సంకేతం తో ఉండాలని లాక్ డౌన్ కి ఒక్కో సైనికుడిలా ఇంట్లో ఉంది ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

పేదలను తప్పక తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని దానికోసం ప్రణాళిక జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేశారు.

కెసిఆర్ గారు ప్రజలందరికీ ముఖ్యంగా యూత్ వాళ్లకి సోషల్ మీడియాలో ఎటువంటి దుష్ప్చారం ఫేక్ న్యూస్ చేయొద్దని కోరారు,ఏ మతాన్ని కూడా తప్పు పట్ట కూడదని కెసిఆర్ గారు హెచ్చరించారు.

అనవసరం అయిన వదంతులను మరియు పుకార్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని అందరూ మనోధైర్యంతో సంఘీభావ సంకేతంతో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు