ఒక వైపు కర్ఫ్యూ అమలులో ఉండగా, పోలీసులు అనుకోకుండా బయటకు వచ్చిన యువకులను మానిప్యులేట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఒకవైపు అందరు ఇంట్లో ఉండి లాక్ డౌన్ నియమాలను పాటింస్తుంటే ఇంకొంతమంది ఈ కొరోనా మమ్మల్ని ఎం చేస్తది అంటూ రోడ్ల మీద చెక్కర్లు కొడుతున్నారు , ఇళ్లల్లోనుండి బయటకు రాకండి బాబూ అంటూ పోలీసులు చేతులెత్తి మొక్కినా కూడా ఈ జనాల చెవులకు కండ్లకు కనిపిస్తలేవు ,
ఇక లాభం లేదని చెప్తే వినట్లేదని లాఠీ పట్టి కొట్టారు అయినా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాంటి వారికి చెప్పి చెప్పి విసిగిపోయిన పోలీసులు వాళ్ళకి బుద్ది చెప్పడానికి కొత్త పద్దతి కనిపెట్టారు.. తమిళనాడు పోలీసులు కనిపెట్టిన ఈ కొత్త పద్దతి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది..
ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి..మరోవైపు ప్రజల నిర్లక్ష్యం .. వీళ్ళకి ఇంట్లో వాళ్ళ మీద కానీ వారి ప్రాణాల మీద కానీ భయం లేదు , ఆ మాకేం కాదులే అనే ధీమాతో ఎంత చెప్పినా వినకుండా రోడ్లెక్కుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు వాతలు తేలెట్టు కొట్టారు అప్పుడు కూడా పోలీసులను తప్పు పట్టి వాళ్ల ఉద్యోగాలనుండి సస్పెండ్ అయ్యేలా చేసాం కాని , వారి మాట వినలేదు..
ఈ మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చెర్యలు చేపట్టిన వినే మనుషులు కాదని ఇలా కాదని తమిళనాడు పోలీసులు కొత్తరకం ట్రీట్మెంట్ మొదలుపెట్టారు .
ఇలా కాదు అని రోడ్ల మీదకి వచ్చిన వారిని తీస్కెళ్లి కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్ లో పడేశారు.. అప్పుడు చూడాలి వాళ్ల కళ్లల్లో భయం..అరుపులు, ఏడుపులు , పెడబొబ్బలు..సార్ ప్లీజ్ సార్, దండం పెడతాం సర్ అంటూ, కిటికిలోనుండి బయటకి దూకేయడానికి ప్రయత్నిస్తూ.. మళ్లీ జన్మలో ఇంటి గడప తొక్కాలంటే భయపడేట్టు చేశారు తమిళనాడు పోలీసులు.
నిజానికి ఈ మూడు నిమిషాల వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతో పాటు, ఒక రకమన భయం కూడా కలుగుతోంది.
కరోనా వైరస్ అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారిని, వారికి ఒక రకమైన భయం కల్పించడానికి, లాక్ డౌన్ పాటించకపోతే ఎలాంటి శిక్ష ఉంటుందో అని చెప్పడానికి అవేర్నెస్ కోసం తమిళనాడు పోలీసులు క్రియేట్ చేసిన వీడియో ఇది.
సోషల్ మీడియాలో తెగ వైరలువుతోన్న ఈ వీడియో చూసి తిక్క కుదిరింది, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే తప్ప వీళ్లు బాగుపడరు అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతే కదా మరి ప్రాణం కంటే ఏది ముఖ్యం బై .
మన ప్రాణం విలువ మనకి తెలిసేలా చేసిన తమిళనాడు పోలీసులకి అభివందనం